ప్రజల సేవకై పాటుపడే వ్యక్తి హరికృష్ణ.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు చైతన్య రథాన్ని వేల కిలోమీటర్లు నడిపించి, పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో హరికృష్ణ ఎంతో కృషి చేశారు. ప్రజల గుండెల్లో అన్నగా నిలిచిపోయాడు హరికృష్ణ. ఇక హరికృష్ణ , ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందు సినిమా రంగంలో ప్రవేశించారు . ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరికృష్ణ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ,చిన్న పైరవీ కూడా చేయలేదు. ఇక ఎక్కడ తన తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా తనదైన శైలిలో ముందుకు నడిచాడు హరికృష్ణ..