జయప్రకాష్ రెడ్డి తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేసేవారు. నెల్లూరు లోని పత్తేకాన్ పేట లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేటలో ఉన్నత పాఠశాలలో చేరాడు.తన తండ్రి బదిలీలతో అనంతపురం, కర్నూలు ,కడప ,ప్రొద్దుటూరు లో చదువుకోవడం , గుంటూరు ,నల్గొండలో నివసించడం వల్ల రాయలసీమ, నెల్లూరు, శ్రీకాకుళం, కోస్తా, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని ప్రాంతాల మాండలికాల పై పట్టు వచ్చింది.ఈయన 2020 సెప్టెంబర్ 8వ తేదీన గుంటూరులో తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. ఇక జయప్రకాష్ రెడ్డి స్థానాన్ని మరెవరు పూడ్చలేని విధంగా లోటు మిగిలిపోయింది..