2008లో నాని హీరోగా, స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన అష్టాచమ్మా చిత్రంలో రెండవ హీరోయిన్ గా భార్గవి స్థానం సంపాదించుకుంది.అటు వెండి తెర పైన ఇటు బుల్లితెర పైన మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న భార్గవి అనతికాలంలోనే జీవితాన్ని ముగించుకుంది. భార్గవి 2006 ఫిబ్రవరి 12న నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్ లో ప్రవీణ్ అనే వ్యక్తిని స్నేహితుల సమక్షంలో ప్రవీణ్ - భార్గవి ల వివాహం జరిగింది. కానీ భార్గవి 2008 డిసెంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన స్వగృహంలో తన భర్త ప్రవీణ్ చేతిలో హత్యకు గురైంది. కానీ ఈమె చనిపోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పటి వరకు తెలియలేదు. ఇక భార్గవిని చంపిన ప్రవీణ్ , ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు..