సిల్క్ స్మిత ఒక వ్యక్తితో ప్రేమలో మోసపోయిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఈమె చనిపోయేముందు నటి అనురాధను కలవాలనుకునే కాల్ చేసింది. కానీ ఆ రోజు రాత్రి వేళ కావడంతో అనురాధ వెళ్ళలేదు. తెల్లవారేసరికి సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుంది. 1996 సెప్టెంబర్ 23న మద్రాసులో తన నివాస గృహంలో మరణించింది.