ప్రముఖ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన, తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే వారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎన్నో చిత్రాలలో తనదైన శైలిలో నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇక 1989లో ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ సాంస్కృతిక మండలిలో అధ్యక్షుడిగా కూడా పని చేశాడు. ఇక దాదాపు 75 సినిమాలలో నటించి ఒక హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇక చివరగా దిల్సుఖ్ నగర్ లోని సర్దార్ నగర్ లో తన భార్య, ఇద్దరు కుమారులతో 1979 నుండి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు . ఇక ఆరు నెలలుగా కాలేయ కేన్సర్ తో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 7 2013 న శనివారం రాత్రి పదిన్నర గంటలకు చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.