ప్రేమికుల రోజు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కునాల్ సింగ్ ముంబై ఓపివర లోని తన ఇంట్లో బుధవారం సాయంత్రం సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని అతను చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇక ఈ సంఘటన జరిగిన సమయంలో అతని స్నేహితురాలు లవీన కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కునాల్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటో మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.