శకుంతల 1951 జూన్ 9 న మహారాష్ట్రలో జన్మించారు. శకుంతల ముందుగా రంగస్థలం ద్వారా పరిచయమయ్యారు. ఒంటి కాలి పరుగు నాటకం తో రంగస్థల ప్రవేశం చేశారు శకుంతల. ఇక ఈమె పద్యపఠనం లో మంచి ప్రావీణ్యం సంపాదించి, శ్రీకృష్ణతులాభారం నాటకంలో సత్యభామగా, మహాకవి కాళిదాసు నాటకంలో విద్యాధరి గా నటించారు. అయితే ఒకరోజు ఈమె నాటకంలో నటిస్తున్నప్పుడు వల్లం నాగేశ్వరరావు ఈమె నటన చూసి ఫిదా అయ్యారు. ఇక ఆ రోజు ఆమె చేసిన నాటకం, అది చూసిన వల్లం నాగేశ్వరరావు చూడడం అన్ని అలా జరిగి పోయాయి. ఇక ఆ రోజు నుంచి ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. ఇక శకుంతల అభివృద్ధికి దోహదపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది కేవలం నటుడు అలాగే దర్శకుడైన వల్లం నాగేశ్వరరావు అని చెప్పవచ్చు. ఆమె సినీ ఇండస్ట్రీలో అంతటి స్థానాన్ని చేరుకోవడానికి గల కారణం కేవలం వల్లం నాగేశ్వరరావు మాత్రమే.