ఐరన్ లెగ్ శాస్త్రి గా పేరు తెచ్చుకున్న ఈయన అసలు పేరు గునుపూడి విశ్వనాథశాస్త్రి. తాడేపల్లిగూడెం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రేక్షకులను తన నటనతో కడుపుబ్బ నవ్వించిన ఈ శాస్త్రి చివరకు 2006లో గుండె సమస్యతో బాధపడుతూ జూన్ 19వ తేదీన మరణించారు. ఈయన చనిపోయే ముందు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయారు. ఇక ఈయన కుటుంబం ఆర్థికంగా ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరినట్లు సమాచారం.