సంగీత దర్శకుడు చక్రి మొదట పండువెన్నెల అనే మ్యూజిక్ ఆల్బమ్ ను చేసి విడుదల చేయగా , దానికి పేరైతే వచ్చింది కాని డబ్బులు రాలేదు. ఇక ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. తరువాత 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ఇక ఆ తర్వాత చిరునవ్వు అనే మ్యూజిక్ ఆల్బమ్ కూడా రెడీ చేయగా, దానిని సనా ఆడియో వారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి సంచలనం సృష్టించారు.ఇలా ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. ఇక మన తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సత్యం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చక్రి సంగీతాన్ని అందించారు.ఈయన సంగీతం అందించిన చివరి సినిమా ఎర్ర బస్సు. ఆ తర్వాత ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు.