కమెడియన్ మల్లికార్జున రావు గారు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కమెడియన్ పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఇక ఈయన నటన గాను తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు లభించగా ,రఘుపతి వెంకయ్య బంగారు పతకం కూడా లభించింది.ఇక తెలుగుదేశం పార్టీలో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేయగా, ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇక ఎన్నో సాధించిన ఈయన తన 57 సంవత్సరాల వయసులో 2008 జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.