రవితేజ పెద్ద సోదరుడు భూపతిరాజు భరత్ రాజు 2017 జూన్ 24వ తేదీన రాత్రి 10 గంటలకు శంషాబాద్ నుండి గచ్చిబౌలికి వెళ్తుండగా, మధ్యలో ఆగి ఉన్న లారీని భరత్, అత్యంత వేగంతో స్కోడా కార్ లో ప్రయాణిస్తూ వెనుకనుంచి లారీని ఢీ కొట్టారు. కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తుపట్టలేని స్థితిలో భరత్ కన్నుమూసారు. చనిపోయిన సమయంలో కేవలం కారులో ఈయన మాత్రమే ఉన్నట్టు పోలీసులు తేల్చి చెప్పారు. అంతేకాదు ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. అందుకే హీరో రవితేజ తమ్ముడు అని గుర్తు పట్టలేక పోయాము అని పోలీసులు చెప్పారు. ఆయన కారు నంబర్ ఆధారంగా ఆయన కుటుంబ సభ్యులు, భరత్ ను గుర్తించినట్లు కూడా తెలపడం జరిగింది. కేవలం 46 సంవత్సరాల వయసులోనే భరత్ స్వర్గస్తులయ్యారు.