రాజబాబు హాస్యనటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు.ఈయన తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అప్పటి నటిమణుల్ని, నటులను గౌరవంగా సత్కరించేవారు. ఇక ఈయన బాలకృష్ణ , శివరామకృష్ణ, సూర్యకాంతం ,రేలంగి ,సావిత్రి మొదలగు ప్రముఖులను సత్కరించారు. అంతేకాదు ఎన్నో సంస్థలకు కొన్ని కోట్ల రూపాయల విరాళాలు కూడా ఇచ్చిన దాత. ఇక అంతే కాకుండా రాజమండ్రిలో చెత్తాచెదారాన్ని శుభ్రపరుస్తూ వుండే కార్మికులకు, అదే ఊరిలో దానవాయిపేటలోని తన భూమిని కూడా రాసిచ్చారు. ఇక కోరుకొండలో "రాజబాబు జూనియర్ కళాశాల" అనే ఒక కాలేజీ కూడా నిర్మించడం విశేషం.