సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులుగా ఉండేవారు. వారు సినిమాలలో కూడా కలిసి నటించే వాళ్ళు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ , నాగేశ్వర్ రావు ల మధ్య మాటా మాటా పెరిగి వివాదానికి దారితీసింది. గుమ్మడి ఆ తర్వాత నాగేశ్వరరావు నటించిన సినిమాలలో ఎక్కువగా నటించడంతో , ఎన్టీఆర్..నాగేశ్వరరావు కి గుమ్మడి బాగా సన్నిహితుడని ఆలోచించి, గుమ్మడికి దూరమయ్యాడు. ఆ తరువాత ఎంతలా అంటే గుమ్మడి తన కూతురు వివాహానికి, ఎన్టీఆర్ ను పిలిచినప్పుడు ఎన్టీఆర్ రాలేదు.ఇక దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు గుమ్మడి. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల మధ్య వివాదాలు తగ్గుముఖం పట్టిన తరువాత గుమ్మడి తప్పు ఏమీ లేదని తెలుసుకున్న ఎన్టీఆర్ ఇక ఎప్పటిలాగానే గుమ్మడి తో స్నేహంగా ఉండడం మొదలు పెట్టాడు.