నటుడు రంగనాథ్ 300 సినిమాలకు పైగా నటుడిగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈయన కేవలం విలక్షణ నటుడు మాత్రమే కాదు ప్రముఖ దర్శకుడు కూడా. మొగుడ్స్ పెళ్ళాం అనే సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతే కాదు పలు టీవీ సీరియల్స్‌లో కూడా తండ్రి పాత్రలో, తాత పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈయన కేవలం దర్శకుడు, నటుడు మాత్రమే కాదు మంచి కవి అలాగే రచయిత కూడా.2015లో అర్ధాంతరంగా కవాడిగూడ, హైదరాబాదులో తన నివాసంలో డిసెంబర్ 19వ తేదీన ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ మూగబోయింది.