ఓంకార్ పరిటాల..ప్రముఖ రచయితగా, నటుడిగా, పత్రికలలో శీర్షికల రచయితగా, బుల్లితెర టీవీ నటుడిగా ఇలా ఎన్నో రకాలుగా మంచి గుర్తింపు పొందాడు ఓంకార్. తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత మొదట రేడియోలో వార్తలు చదవడం ప్రారంభించాడు.సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను రచనల రూపంలో రాసి, సీరియళ్ళలో చూపిస్తూ, ప్రజాదరణ బాగా పొందాడు.నటుడిగా 1990లో వచ్చిన పోలీస్ భార్య, అన్న తమ్ముడు వంటి సినిమాల్లో నటించాడు. 2007 జనవరి 7వ తేదీన గుండెపోటుతో మరణించారు.