అమ్మాయిలు అబ్బాయిలు చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన విజయసాయి తన 38 సంవత్సరాల వయసులోనే మరణించడం విషాదం.చివరిగా 2017 డిసెంబర్ 11వ తేదీన తను నివాసం ఉంటున్న ఇంటిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని మరణించాడు. ఇందుకు కారణం తన భార్య కు సంబంధించిన ఒక వీడియో రికార్డ్ చేసి, ముగ్గురు వ్యక్తులు తనను మూడు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అంత ఇచ్చుకోలేక, భార్య జీవితం నాశనం కాకూడదని, ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మరణించిన తర్వాత ఆయన నటించిన కొత్తగా మా ప్రయాణం అనే సినిమా విడుదలైంది.