డి.రామానాయుడు తన నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఏకంగా 150 చిత్రాల కంటే ఎక్కువ సినిమాలను నిర్మించడంతో, ఈ అరుదైన రికార్డును సృష్టించిన ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2013లో స్థానం సంపాదించుకున్నారు.అంతేకాదు పార్లమెంటు సభ్యుడిగా కూడా 1999 నుంచి 2004 వరకు పనిచేశారు. బాపట్ల నియోజకవర్గం నుండి లోకసభ సభ్యుడుగా ఎంపికయ్యారు. 2015 ఫిబ్రవరి 18వ తేదీన ప్రోస్టేట్ క్యాన్సర్ తో మరణించారు.