ఏవీఎస్..సినీ ఇండస్ట్రీలో ఒక నటుడిగా, నిర్మాతగా, హాస్యనటుడిగా , జర్నలిస్టుగా, దర్శకుడిగా ఇలా పలు రంగాలలో తనకంటూ మంచి గుర్తింపు పొందారు. అంతే కాదు కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు అలా మొత్తం ఐదు వందలకు పైగా సినిమాలలో నటించి, ఉత్తమ హాస్య నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ,ఉత్తమ సహాయ నటుడిగా నాలుగు రాష్ట్ర నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.