మొదట సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టి, ఆ తర్వాత విలన్ గా, చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుకోవడంతో పాటు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు డా.ఎం. ప్రభాకర్ రెడ్డి.తొలి సినిమా " చివరికి మిగిలేది" అనే సినిమాకు నటుడి పాత్ర కోసం అవకాశం వచ్చినప్పుడు, ప్రభాకర్ రెడ్డి ఎంబిబిఎస్ పరీక్ష రాస్తున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ లో ఆయన నటించారు.అయితే ఈ సినిమా విడుదల అవ్వకముందే ఎంబిబిఎస్ రిజల్ట్స్ వచ్చి ఆయన డాక్టర్ అయ్యారు.