తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు యువ కథానాయకులు హీరోలుగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు. చివరికి ఒకటి రెండు సినిమాలతోనే సరి పెట్టుకుని మాయమై పోతుంటారు. మరి కొందరు సినిమా ఇండస్ట్రీలో దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అలా ప్రముఖ దివంగత యువ నటుడు ఉదయ్ కిరణ్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి ఒకసారి స్మరించుకుందాం. ఉదయ్ కిరణ్ కు ఎలాగోలా తేజ కొత్తగా డైరెక్ట్ చేస్తున్న చిత్రం సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమానే ఉదయ్ కిరణ్ కు మొదటి సినిమా. ఇందులో నటించిన హీరోయిన్ రీమాసేన్ కు కూడా ఇదే మొదటి సినిమా.

"చిత్రం" సినిమా విడుదలయి అప్పట్లో ఊహించనంతగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. టాలీవుడ్ లో ఒక్కసారిగా డైరెక్టర్ తేజ పేరు మారు మ్రోగింది. ఈ సినిమా కథ, నటన, డైరెక్షన్, సంగీతం ఇలా ప్రతి ఒక్కటి సినిమా విజయానికి తోడ్పడ్డాయి. ఆ తర్వాత హీరోయిన్ రీమాసేన్ కు వరుసగా అవకాశాలు రావడంతో బిజీ అయింది. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఆర్ పి పట్నాయక్ కూడా బిజీ అయిపోయారు. అయితే హీరో ఉదయ్ కిరణ్ కు మాత్రం ఎటువంటి అవకాశాలు రాలేదు. కానీ ఇది ఎవ్వరూ ఊహించనిది అని చెప్పాలి. డైరెక్టర్ తేజ కు వరుస అవకాశాలు వస్తున్నా కథను రెఢీ చేసుకునే పనిలో ఉన్నాడు. కానీ ప్రతి రోజూ ఉదయ్ కిరణ్ తేజ ఆఫీస్ కు వచ్చి వెళ్లే వాడట.

అయితే ఆ తరువాత తేజ రెండవ సినిమా నువ్వు నేను లో మొదట అనుకున్న హీరో హ్యాండ్ ఇవ్వడంతో ఇక వేరే ఆప్షన్ లేక అక్కడే ఉన్న ఉదయ్ కిరణ్ నే నువ్వు నేను లో హీరోగా ఎంపిక చేశాడు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో, తను మొదటి సినిమా చేసిన డైరెక్టర్ తోనే రెండవ సినిమా చేయడం అది కూడా అసలు అవకాశాలు రాకపోవడం వల్ల అనేది వింతగా ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు. అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. అలా ప్రేక్షకుల మదిలో కొన్ని సినిమాలు చేసి చెరిగిపోని మధుర స్మృతులను మిగిల్చి అనంతలోకాలకు తరలి వెళ్ళిపోయాడు ఈ ధృవతార ఉదయ్ కిరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: