దేశంలో అత్యంత విశిష్టమైన పండుగల్లో విజయదశమి ఒకటి. ముఖ్యంగా నవరాత్రులకు ఎంతో ప్రత్యేక స్థానముంది. 9 రోజుల పాటు నిర్వహించే ఈ నవరాత్రుల్లో దుర్గామాతను ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. ఈ ఏడాది నవరాత్రుల ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవరాత్రి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.