తెలుగు సంవత్సరాలలో ఎనిమిదో నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం. ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు, దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది.