నీలం అన్నీ కలిసిన వాటికి ఆధారం. దీని ఆధారంగా భారతదేశంలో చాలా మంది దేవతలను నీలిరంగు చర్మం గలవారుగా చూపించారు. శివుడికి నీలిరంగు చర్మం, కృష్ణుడికి నీలిరంగు చర్మం, రాముడికి నీలిరంగు చర్మం ఉంది. వారి చర్మం నీలం రంగులో ఉందని కాదు. నీలిరంగు ప్రకాశం ఉన్నందున వారిని నీలి దేవతలుగా పిలుస్తారు.