పెళ్లి అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లి ఏవిధంగా జరుపుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యం. మన దేశంలో వివిధ రకాల మతాలు కులాలు ఉన్నాయి కాబట్టి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఎన్నో సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. పెళ్లి అంటే ఎన్నో పనుల సమ్మేళనం...ఎంగేజ్ మెంట్, ఇంటి దేవుళ్లను పూజించడం.. గౌరీపూజ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, పాణిగ్రహణం, మధుపర్కం, మంగళసూత్ర ధారణ, బ్రహ్మముడి, సప్తపది, నాగవల్లి, అరుంధతీ నక్షత్రం, అప్పగింతలు వంటి ఎన్నో సంప్రదాయమైన పద్ధతులు ఉంటాయి.