మన సంప్రదాయం మరియు హిందూ శాస్త్రం ప్రకారం మార్గశిర మాసానికి గొప్ప విశిష్టత ఉంది. సాక్ష్యాత్తు ఆ విష్ణు భగవానుడికి ఈ మాసమంటే చాలా ఇష్టం. ఈ మాసం మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో మరో శుభ దినం కూడా ఉంది. అదే వైకుంఠ ఏకాదశి, దేనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీన వచ్చింది.