మన దేశంలో హిందువులు ఆచరిస్తున్న సంప్రదాయ, ఆచార వైవాహారాల ప్రకారం పెళ్ళైన పురుషుడు భార్య ప్రక్కన లేకుండా ఏ కార్యమూ చేయకూడదు. ఇది శాస్త్రం చెబుతున్న మాట. ఆ కార్యమూ ఏదైనా కావొచ్చు. పూజ కావొచ్చు, ఒక వ్రతం కావొచ్చు లేదా మరే ఇతర శుభ కార్యం కావచ్చు. పురుషుడు చేయాల్సినవి ఎన్ని కార్యాలున్నా కానీ భార్య లేకపోతే సక్రమంగా ఏ కర్మ చెయ్యడానికి శాస్త్ర ప్రకారం అతడికి అర్హత లేదు.