భక్తి శ్రద్ధలతో తనని ఆరాధిస్తే చాలు కరుణించే కరుణామయుడు గణేశుడు. నమ్మకంతో తనను పూజిస్తే చాలు సకల విఘ్నాల నుంచీ కాపాడతాడు. హిందువులందరూ ఏ కార్యాన్ని తల పెట్టాలన్నా మొదటిగా పూజ చేసేది ఆ విఘ్నేశ్వరునికే . ఆ తర్వాతే మిగిలిన దేవుళ్లకు పూజలు జరుపుతారు. అంతటి విశిష్టత ఆ వినాయకుడికి ఉంది. అలాంటిది ఆయన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనే అనుమానం చాలామందికి ఉంది.