ప్రతి ఆలయానికి ఒక్కో చరిత్ర , పలు ఆసక్తికర విశేషాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఆలయం మాత్రం ఎన్నో ఆసక్తికర విషయాలను, అంతుచిక్కని వింతలను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన భవిష్య వాణి లోని పలు ప్రముఖ అంశాలు అందరికీ తెలిసే ఉంటాయి. అందులో ఒకటి...కలియుగాంతంలో కర్నూలు జిల్లాలోని యాగంటిలో ఉండే బసవయ్య లేచి రంకెలేస్తాడు.