తెలుగు సంవత్సరాదిలో మొదటి పండుగ ఉగాది. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది.