చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, ఆ రోజు నుంచి ఈ సృష్టి ప్రారంభమైంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారు అని పెద్దలు చెబుతారు..అలాగే వేదాలను హరించాడని..సోమకుని వధించేందుకు శ్రీ మహా విష్ణువు మత్స్య అవతారం లో వచ్చి అతడిని వధించినాడని పురాణాల్లో ఉంది. ఆ తరువాత ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించడం కూడా జరిగింది. ఇక ఆరోజు నుంచి ఉగాది జరుపుకోవడం ప్రారంభమైందని చెబుతుంటారు..