తెలుగు సంవత్సరాది చైత్రమాసంలో జరుపుకునే తెలుగు వారి మొదటి పండగ. ఇక ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం. ఉగ అనగా నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి. ప్రపంచ జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.