ఉగాది పండగను తెలుగు సంవత్సరాది అంటారని మన అందరికి తెలిసిన విషయమే. అసలు మనం ఉగాది పండగను ఎందుకు జరుపుకుంటాము. ఉగాది పండగకి ఎందుకు అంత ప్రాముఖ్యతను ఇస్తారో ఒక్కసారి చూద్దామా. అయితే చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అందుకే మనం ఆ రోజున యుగాది జరుపుకుంటాం. ఇక ఆరోజు నుండే ఈ సృష్టి ప్రారంభమయ్యిందని మన పూర్వీకులు చెబుతూ ఉండేవారు.