మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం. ఓ వ్యక్తిని మంచి వ్యక్తా కాదా వారి గుణగుణాలేంటి అని తెలుసుకోవటానికి ఆ వ్యక్తి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోనక్కర్లేదు..ఆ వ్యక్తిలోని కొన్ని లక్షణాలను పరిశీలిస్తే చాలు. వాటిలో ముఖ్యమైనవి ఆ వ్యక్తి యొక్క నడవడిక అలాగే దానం చేసే గుణం. అయితే దాన గుణం అన్ని చోట్లా ..అన్ని వేళలా మంచిది కాదు.