అక్షయ తృతీయ మహిళలకు ప్రధానమైందే కాదు ఇష్టమైన పండుగ కూడా, సంస్కృతంలో అక్షయం అంటే నాశనం లేనిది అనంతమైనది అని అర్ధము. ఈ మహా పవిత్రమైన రోజున ఏ పని ప్రారంభించినా ఎటువంటి అంతరాయం లేకుండా లాభదాయకంగా కొనసాగుతుందని ఒక విశ్వాసం. అలాగే ఈ పండుగకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పవిత్రమైన నాడే త్రేతాయుగం ప్రారంభమైనదని పూర్వీకులు చెప్పేవారు.