బంగారం మొట్టమొదటిసారి భూలోకంలో గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజు అక్షయ తృతీయ గా జరుపుకుంటారు. అయితే ప్రతి ఒక్కరికి బంగారం కు పండుగ ఏమిటి ? అని సందేహం కలగవచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం..బంగారాన్ని హిరణ్మయి అని కూడా పిలుస్తారు. అంటే విష్ణువు హిరణ్యగర్భుడు. గర్భం నందు బంగారం కలిగిన వాడు అని అర్థం. ఈ బంగారం మహావిష్ణువు ప్రతి రూపం కాబట్టి, అందుకే బంగారం అంత పూజనీయమైనది. ఇక దీని జన్మదినమైన అక్షయతృతీయ అందరికీ పండుగే.. ఇక అక్షయ అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా, శాశ్వతంగా ఉండగలిగేది అని అర్థం.. అందుకే ఈ రోజు బంగారం కొంటే, ఆర్థికంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారు ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు.