ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానా ఇస్లామీయ కేలండర్ ప్రకారం తొమ్మిదవ నెల "రంజాన్ " పండుగగా జరుపుకుంటారు. అంతేకాదు దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం "దివ్య ఖురాన్ "గ్రంథం. ఈ మాసంలో అవిర్భవించింది కాబట్టి. అంతేకాకుండా స్వర్గం నుండి భువికి దిగి వచ్చింది కూడా ఈ రోజే అని పెద్దలు చెప్తారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ రంజాన్ మాసం.ముఖ్యంగా చెప్పాలి అంటే, ప్రపంచంలోని ప్రతి ముస్లిం 5 ప్రాథమిక విధులను తప్పకుండా పాటించాలి. నమాజ్, ఇమాన్, రోజా, జకాత్, హజ్ వంటివి ప్రతి ముస్లిం తప్పకుండా చేయాలి..