చాలామంది తమ అధికార బలంతో.. పలుకుబడితో తిరుమలలో సకల సౌకర్యాల కోసం వెంపర్లాడుతుంటారు. సిఫార్సులు, పలుకుబడి ఉపయోగించి దర్శనం సాఫీగా జరిగేలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ఆ శ్రీనివాసుడిని ఓ సామాన్యుడిగా దర్శించుకుంటేనే అందులో సాఫల్యం కలుగుతుంది. అందుకే శ్రీవారి యాత్రను పరమ నిష్టంగా చేయండి. అలౌకిక ఆనందం పొందండి.