ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే హాజ్ యాత్ర చేయాలని ఇస్లాం సూత్రాలలో చెప్పబడింది. అంతే కాకుండా ఈ యాత్రకు ఓ కటిన నిబంధన కూడా ఉంది. యాత్రకు వెళ్లే వ్యక్తి కష్టపడి సంపాందించిన ధనాన్ని వినియోగించి మాత్రమే హాజ్ యాత్రకు వెళ్ళాలి. మానవత్వమే మనిషిని కాపాడుతుందని ప్రతి ఒక్కరిలోనూ మానవత్వం పెంపొందాలన్నదే బక్రీద్ యొక్క ఆంతర్యం.