ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం,19.11.2019 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 19C°-25℃°.
• నిన్న 71,691 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 గదిలో భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును.
• నిన్న 25,588 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు
₹: 3.90 కోట్లు.
• శీఘ్రసర్వదర్శనం(SSD), ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
గమనిక:
# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.
# ఈనెల 26న వృద్ధులు / దివ్యాంగులకు ప్రత్యేక
ఉచిత దర్శనం, (భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు).
# ఈనెల 27 న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వరకు సుపథం మార్గం
ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.
వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు.
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,