సీతాదేవి దూరమైన నిరంతరం అమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు. ధర్మానికి ఒక నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్రుడు. ఈ రామాయణంలో రాముడి కి ఉన్న లక్షణాలు గురించి చెబుతూ షోడశ మహాగుణలు ఉన్నట్లు వర్ణించబడింది. కానీ వీరితో పాటుగా సీతాదేవి, లక్ష్మణుడు ,మరియు హనుమంతుడికి కూడా కొన్ని ప్రతేయక గుణాలు ఉన్నాయి. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీకగా నిలిచింది. తన భర్త తనను అనుమానించినా, తన పాతివ్రతాన్ని నిరూపించుకునేందుకు భూస్థాపితం అయింది. ఇప్పటికీ మన భారతదేశహములో స్త్రీ అంటే సీతాదేవితోనే పోలుస్తారు. అంతటి మహాసాధ్వి. లక్ష్మణుడు అన్న మరియు వదినలు కోసం పద్నాలుగేళ్ల నిద్రపోకుండా ఉండేందుకు వరాన్ని పొందాడు. ఆ నిద్రను తన భార్య అయిన ఊర్మిళకు ఇచ్చాడు. దానితో ఆమె లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చే వరకు ఆమె మేల్కోలేదు.
హనుమంతుడి గురించి ఎంత చూపిన తక్కువే అవుతుంది. రామాయణంలో ఒక మహాఘట్టానికి కారణమయ్యాడు. రామునికి మహాభక్తుడిగా కీర్తించబడ్డాడు. కానీ రాముడిలో ఉన్న గుణాలే ఆయనను ఆదర్శ మూర్తిగా నిలబెట్టాయి. రాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, సకల ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఇవనీ కలిస్తేనే శ్రీరామునికి పూర్తి అర్ధం అవుతుంది. జై శ్రీరామ్...!