ఇక ఇంటి ముందు కాకి పదే పదే అరుస్తుంటే దానికి కూడా కొన్ని కారణాలు చెప్పబడ్డాయి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కనుక కాకి ఇంటి ముందు వాలి పెద్దగా అరుస్తుంటే మీరు వెళ్ళే పని విజయవంతంగా పూర్తవుతుందని అర్థం. ఆహారాన్ని తీసుకెళుతున్న కాకి ఆ ఆహారాన్ని మనిషిపై పడేస్తే, ఆ వ్యక్తికి ప్రమాదం పొంచి ఉన్నట్లు సూచన. నిండుగా ఉన్న కుండపై లేదా నీళ్ళు నిండుగా ఉన్న వస్తువుపై కాకి కూర్చోవడం మనిషి చూస్తే, ఆ వ్యక్తి త్వరలో ధనవంతులు అవుతారని అర్థం. కాకి కనుక పదే పదే మన దృష్టిని ఆకర్షించేలా అరుస్తుంటే మన ఇంటికి బంధువులు రాబోతున్నట్లు సంకేతం.
ఒకవేళ కాకి మనిషి తలపై తాకినా లేదా తన్నినా ఆ వ్యక్తి త్వరలో అనారోగ్య పాలవుతారని అర్థం. ఒకవేళ కాకి రెక్కలు విప్పి ఆడిస్తూ తిరుగుతూ మీ ముందు కానీ, ఇంటి ముందు కానీ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎవరో మారాణించబోతున్నారని సంకేతం. ఇలా కాకి జరగబోయే విషయాలను మనుషులకు తెలియజేసేందుకు పలు సంకేతాలను అందజేస్తుందని మన పూర్వీకులు చెబుతున్నారు. ఇవి కేవలం గతంలో పూర్వీకులు వారి పరిస్థితులను బట్టి చెప్పబడినవి మాత్రమే. ఈ విషయాలను నమ్మొచ్చా లేదా అనేది పూర్తిగా మీ ఇష్టం.