ఆస్ట్రేలియా-ఎ జట్టుతో సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో కేవలం 73 బంతుల్లోనే 9x4, 6x6 సాయంతో 103 పరుగులు చేశాడు. మ్యాచ్లో రెండో రోజైన శనివారం చివరి ఓవర్ని వ్యక్తిగత స్కోరు 81 పరుగుల వద్ద ఎదుర్కొన్న రిషబ్ పంత్.. ఆ ఓవర్లో ఆఖరి ఐదు బంతుల్ని 4,4,6,4,4గా మలిచేసి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.