ప్రస్తుతం క్రికెట్ బ్యాట్స్ మెన్ ఆటగా అయిపోయిందనే విషయం ఎవరూ కాదనలేని వాస్తవం. ఎక్కువగా బ్యాట్స్ మెన్ కే ఫేమస్ అయ్యే అవకాశాలున్నాయి. బౌలర్లు ఎంత చించుకుని వికెట్లు తీసినా, చివరకు బ్యాట్స్ మెన్ కి పోటీ రాలేకపోతున్నారు. ఆల్ రౌండర్ అయితేనే కొద్దో గొప్పో ఫేమస్ అయ్యే ఛాన్స్ లున్నాయి. ఈ దశలో బౌలర్లకు కూడా ప్రాధాన్యం పెరగాలంటే.. వారు కూడా క్రికెట్ లో హీరోలుగా మారాలంటే కొన్ని మార్పులు రావాలన్నారు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్. జైసింహా స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన క్రికెట్ లో రావాల్సిన మార్పులు, చేర్పుల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.