ప్రస్తుతం భారత క్రికెట్లో మిస్టర్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు మహేంద్రసింగ్ ధోని. నేటి రోజుల్లో ధోని జీవితమే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే భారత క్రికెట్ కు ఎన్నో రోజుల పాటు సేవలందించాడు మహేంద్ర సింగ్ ధోనీ.. తన కెప్టెన్సీ నైపుణ్యంతో ఎన్నోసార్లు భారత జట్టుకు విజయాన్ని అందించాడు. భారత జట్టుకు మాత్రమే కాదు బిసిసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా