జింబాబ్వే ప్రముఖ క్రికెట్ ఆటగాడు ర్యాన్ బర్ల్. ఈయన మాట్లాడుతూ.. "మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం.. సిరీస్ ముగిసిన ప్రతిసారి మా షూస్ కు గ్లూ రాసుకుని వాటిని కాసేపు ఎండబెట్టుకుని, ఆ తర్వాత మ్యాచ్ కు మళ్ళీ అవే షూతోనే వెళుతున్నాం. ఇలా దాదాపుగా కొన్ని నెలలపాటు చేస్తూనే ఉన్నాం. కనీసం షూ కొనే స్థోమత కూడా లేదు. ఎవరైనా స్పాన్సర్ ఉంటే సహాయం చేయండి.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇలా తన ఆవేదనను వ్యక్తం చేయడం ద్వారా జింబాబ్వే క్రికెట్ ఆటగాళ్లు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో అందరికి అర్ధం అవుతోంది. అయితే అతను అలా పోస్ట్ పెట్టడం ద్వారా ఒక షూ స్పోర్ట్స్ కంపెనీ అతనితో ఒప్పందం చేసుకోవడమే కాక జింబాబ్వే ఆటగాళ్లకు షూస్ ను గిఫ్టుగా పంపి తన ఉదారతను చాటుకుంది.