రోజురోజుకు ప్రేక్షకుల ఛాయిస్ మారిపోతుంది . టీవీల కంటే ఓటీటీ ప్లాట్ఫాం వైపే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో అనలాగ్ ఛానెల్స్ కంటే హెచ్డీ ఛానల్స్ కే ఆదరణ పెరుగుతోంది. కాబట్టి మా దగ్గర ఉన్న కంటెంట్ ను డిస్నీ ప్లస్ లోకి తరలిస్తున్నామని డిస్నీ సీఈవో బాబ్ చెక్ వెల్లడించారు. 2020లో 30 టీవీ ఛానల్స్ ని బంద్ చేశాము. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరికి 100 టీవీ ఛానల్స్ ను బంద్ చేయాలని నిర్ణయించుకున్నామని" కూడా ఆయన ఒక మీడియా కాన్ఫరెన్స్ లో తేల్చి చెప్పారు. డిస్నీ మూసివేయాలి అనుకుంటున్న ఛానల్స్ లో బాగా పాపులారిటీ పొందిన స్పోర్ట్స్ ఛానల్స్.. స్టార్ స్పోర్ట్స్ వ,న్ స్టార్ స్పోర్ట్స్ 2, ఫాక్స్ స్పోర్ట్స్ 1, ఫాక్స్ స్పోర్ట్స్ 2 , ఫాక్స్ స్పోర్ట్స్ 3 వంటి అనలాగ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా వీటిని మూసివేసి, ఆ తరువాత హెచ్డీ ఛానల్స్ మాత్రమే కొనసాగించే అవకాశం ఉంటుంది.