యూఏఈలో ఐపీఎల్ ను పూర్తి చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వాయిదాపడిన ఐపీఎల్ ను తప్పకుండా పూర్తిచేయాలని ఎంజీఎంలో సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కార్యదర్శి జైషా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.వచ్చే అక్టోబర్- నవంబర్ మాసాల్లో ఐపీల్ నిర్వహించాలని, అలాగే పురుషుల టీ20 వరల్డ్ కప్ కూడా నిర్వహించాలనే చర్చ జరిగింది. ఈ టోర్నీ పై స్పష్టత ఇచ్చేందుకు ఐసీసీతో బీసీసీఐ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. వారికి కాస్త సమయం కావాలని ఐసీసీ ని కోరామని ఆయన తెలిపారు. సరైన సమయంలో టీ 20 వరల్డ్ కప్ నిర్ణయం తీసుకోనున్నట్లు జైషా వెల్లడించారు. కాగా ఐపీఎల్ పూర్తిచేసి త్వరలోనే గవర్నింగ్ కౌన్సిలర్ విడుదల చేయనున్నామని తెలిపారు.