అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024 - 2031 సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించిన ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ ను మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై టీ 20 వరల్డ్ కప్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహాలోనే రెండేళ్లకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఇందులో 20 జట్లను తీసుకురానుందట. అలాగే 50 ఓవర్లలో వన్డే ప్రపంచ కప్ టోర్నీకి 14 జట్లతో ఆడించాలని చూస్తోంది.పురుషుల ప్రపంచ కప్ ఫార్మెట్ ను ఐ సీ సీ వివరించింది. ప్రస్తుతం 10 జట్లు పాల్గొంటుండగా.. భవిష్యత్తులో 14 టీం లతో జరపాలని నిర్ణయించింది. అయితే 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఇందులో ప్రతి గ్రూప్ లో టాప్ త్రీ లో ఉన్న జట్లను సూపర్ సిక్స్ గా పరిగణిస్తారు. ఆ తర్వాత సెమిస్, ఫైనల్స్ నిర్వహిస్తారు.2003 లో ప్రపంచ కప్ లో ఇదే పరిస్థితి పాటించారు.