గత  సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఎవరూ ఊహించని విధంగా మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. తన రిటైర్మెంట్ గురించి చెన్నై టీం లో కనీసం ఎవరికీ కూడా ఈ విషయం తెలియదు అంటూ సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. రుతు రాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్ నన్ను గతేడాది చాలా షాక్‌కు గురి చేసింది. 2020, ఆగస్టు 15 ఇంటర్నేషనల్ క్రికెట్ కి ధోని సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే నేను కూడా ఐపీఎల్ 2020 సీజన్ కోసం అప్పుడే ప్రాక్టీస్ ముగించుకొని సహచరులతో కలిసి డిన్నర్ కోసం వెళ్లాను .. అంతలో చెన్నై టీమ్‌లోని ఒకరు వచ్చి ధోని రిటైర్మెంట్ ప్రకటించినట్లు మాతో చెప్పాడు.. " అంటూ గైక్వాడ్ గుర్తు చేసుకున్నాడు.