టీమిండియా క్రికెట్ ప్లేయర్ అజింక్య రహానే టెస్ట్ వైస్ కెప్టెన్. అయితే ఈ రోజు తన 32 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. రహానే క్రికెట్ తో పాటు కరాటే లో కూడా బ్లాక్ బెల్ట్ హోల్డర్. ఇలా రెండు రకాల ఆటలలో గుర్తింపు ఉన్న కొద్దిమంది లో రహానే కూడా ఒకరు. శ్రీలంకతో 2015 లో జరిగిన మ్యాచ్ లో రహానే 8 క్యాచ్ లు పట్టాడు. ఆ మ్యాచ్ లో వికెట్ కీపర్ కాకుండా రహానే ఒక్కడే క్యాచ్ లు అన్నీ పట్టడం గమనార్హం.